Chevuri Avinash | హైదరాబాద్ : చాలా కాలం తర్వాత ఒక రిమ్కోలియన్ మెడిసిన్ విద్యార్థిగా వైద్య కళాశాలలో చేరాడు. డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసి)లో చదివిన విద్యార్థులను ‘రిమ్కోలియన్స్’గా పిలుస్తారు. 1922లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చేత ప్రారంభించబడిన ఈ కళాశాల, స్వాతంత్ర్యం తరువాత రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీగా పేరు మార్చబడింది. ఇది దేశానికి అనేక ఆర్మీ అధికారులు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలను అందించింది. ఐపిఎస్ అధికారి రాజీవ్ రతన్ కూడా ఈ కళాశాల విద్యార్థి.
ఆర్ఐఎంసి అనేక ప్రతిష్టాత్మక రక్షణ సిబ్బందిని అందించడంలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు. ఈ కళాశాల నుంచి నలుగురు భారత సైన్యాధిపతులు, ఇద్దరు భారత వైమానిక దళాధిపతులు, ఇద్దరు పాకిస్తాన్ వైమానిక దళాధిపతులు, ఒక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, బంగ్లాదేశ్‌లో ఉన్నత స్థాయి రక్షణాధికారులు ఉద్భవించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక గుర్తింపును పొందిన ఏకైక విద్యాసంస్థగా ఆర్ఐఎంసి గుర్తింపు పొందింది.
చేపూరి అవినాష్ తన 13 సంవత్సరాల వయస్సులో 2017లో రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసి)లో ప్రవేశం పొందాడు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాత పరీక్ష ద్వారా ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు.
సాంప్రదాయ రీత్యా రక్షణ రంగంలో సాహసాలు చేసే ఆర్ఐఎంసి విద్యార్థులు రక్షణశాఖతో పాటు వారికి నచ్చిన భిన్న మార్గాలను ఎంచుకుంటారు. ఉత్తమ భారతీయ పౌరుడిగా ఆర్ఐఎంసి క్యాడేట్లను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ మిలిటరీ కళాశాల శిక్షణ ఇస్తుంది. ఈ విధంగానే అవినాష్ వైద్యరంగాన్ని ఎంచుకుని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశించాడు. ఆర్ఐఎంసి విద్యను పూర్తిచేసిన తర్వాత, 2024లో మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందిన రిమ్కోలియన్గా నిలిచాడు.
2017లో ఉత్తరాఖండ్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ గెలవడం నుంచి, 2023లో తెలంగాణ చీఫ్ మినిస్టర్ కప్‌లో సిల్వర్ మెడల్ అందుకోవడం వరకు, అవినాష్ అనేక పతకాలను గెలుచుకున్నాడు. 2019లో ఆర్ఐఎంసి నుండి మెరిట్ కార్డ్, హాఫ్-బ్లూ పురస్కారాలను అందుకోవడం ద్వారా అతని ప్రతిభను సైనిక విద్యాసంస్థల అత్యున్నత ప్రమాణాలకు చిహ్నంగా నిలిపాడు.
2021 నార్త్ జోన్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో జూనియర్, యూత్ కేటగిరీల్లో నేషనల్ చాంపియన్షిప్కి అర్హత సాధించడమే కాకుండా, 2022, 2023లో 65వ, 66వ నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లలో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఎఐ) చే “రినౌన్డ్ షాట్” గా అర్హత సంపాదించాడు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు రేవంత్ రెడ్డి..! సీఎంపై హరీశ్‌రావు ధ్వజం
500 Fake Notes | స్టాంప్ పేపర్‌పై రూ.500 నోట్లు ముద్రించారు.. తర్వాత ఏం జరిగిందంటే?
SSC Exam Fee | పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల
Telangana | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. తదుపరి విచారణ 11కు వాయిదా