నల్లగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు. నల్లగొండ జిల్లా(Nallagonda) కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) హయంలోనే విద్యా,వైద్య రంగాలు అభివృద్ధి చెందాయని ప్రశంసించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని ,క్యాన్సర్,అంకాలజీతో సహా అన్ని ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఏకకాలంలో 8 మెడికల్ కళాశాలలు(Medical colleges) మంజూరు చేయడం తో పాటు వచ్చే విద్యాసంవత్సరంలో మరో 9 మెడికల్ కళాశాలల ఏర్పాటు చేయబోతున్న సాహసం ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.
హెల్త్ కార్డులు అక్కర లేకుండానే ప్రభుత్వ ఆసుపత్రిలలో ఆధునిక వైద్యం అందుబాటులో ఉందన్నారు. అటువంటి సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మెడికల్ కళాశాలల ఏర్పాటు ద్వారా ప్రతి జిల్లా కేంద్రంలో వందలాది మంది ప్రభుత్వ డాక్టర్లు అందుబాటులో ఉన్నారన్నారు. విద్య రంగంలోనూ సంచలనాత్మకమైన మార్పులను తీసుకువచ్చారని కొనియాడారు.
ప్రభుత్వ పాఠశాలల్తో పోల్చి చూస్తే కార్పొరేట్ విద్యా సంస్థ లలో ఫెయిల్యూర్ లు ఎక్కువని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన ప్రైవేట్ ఉపాధ్యాయ,ఉపాధ్యాయినీలకు ఉత్తమ విద్య సేవ అవార్డులను అందించి సత్కరించారు. శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి , ట్రస్మా అధ్యక్షుడు కోడి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, పాపిరెడ్డి , బీఆర్ఎస్ నాయకుడు సుంకరి మల్లేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.