హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో కొనసాగిన ప్రగతి సమావేశం నుంచి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని మరోసారి తొలగించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదిత ర అంశాలపై సమీక్షించాల్సి ఉండగా చివ రి నిమిషంలో వాయిదా వేశారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నా.. ప్రస్తుతం కేవలం 41.67 మీటర్ల ఎత్తులోనే నీటిని నిల్వ చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 5,277.84 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. తెలంగాణలోనూ 6 మండలాల్లో 954 ఎకరాలు ముంపునకు గురికానున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
కార్పొరేట్ చేతుల్లో మోదీ స్టీరింగ్ ; దేశంలో అప్రకటిత ఎమెర్జెన్సీ ‘ఎమెర్జెన్సీ నాడు.. నేడు’ సదస్సులో వక్తలు
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్నాయని, ప్రస్తు తం మోదీ స్టీరింగ్ కార్పొరేట్ చేతుల్లో ఉందని వక్తలు విమర్శించారు. ‘నాడు ప్రకటిత ఎమెర్జెన్సీ.. నేడు అప్రకటిత ఎమెర్జెన్సీ-మన కర్తవ్యాలు’ అనే అంశంపై సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో బుధవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అధ్యక్షతన సదస్సు జరిగింది. కేంద్ర ఆర్టీఐ మాజీ కమిషనర్ మాఢభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం, అందులోని సూత్రాలను విస్మరించి నాడు ఎమెర్జెన్సీ ప్రకటించారని తెలిపారు. తప్పుడు నిర్ణయాల వల్ల ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పునిచ్చారని వివరించారు. సుప్రీంకోర్టు సీజేఐ, పార్లమెంట్, పీఎం అందరికన్నా రాజ్యాంగమే గొప్పది అని స్పష్టంచేశారు. అతిక్రమిస్తే ప్రజలే రాజ్యాంగాన్ని రక్షించుకుంటారని నాటి ఘటనలు చెబుతున్నాయని గుర్తుచేశారు. నాలుగొందల సీట్లు వస్తాయని కలగన్న వారికి ప్రశ్నించే శక్తులు పెరగడం వల్ల అనుకున్న సీట్లు రాలేదని గుర్తుచేశారు.