హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రెవెన్యూశాఖకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) నేతలు మంగళవారం ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావుకు వినతిపత్రం అందజేశారు. దీనిపై రెండు రోజుల్లోగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, కే గౌతమ్‌కుమార్ తెలిపారు.
అంతకుముందు మూసారాంబాగ్‌లోని రెవెన్యూభవన్‌లో ట్రెసా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో పదోన్నతులు, క్యాడర్‌స్ట్రెంత్, కారుణ్య నియామకాలు, వీఆర్ఏలకు పే సేలు వంటి పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, పీ రాజ్‌కుమార్, ఎల్ పూల్‌సింగ్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, సీఎల్బీ శాస్త్రి, డీ మధుసూదన్, కే నిరంజన్, కార్యదర్శులు సయ్యద్ మౌలానా, కే వెంకట్‌రెడ్డి, మనోహర్ చక్రవర్తి, పల్నాటి శ్రీనివాస్‌రెడ్డి, చిల్లా శ్రీనివాస్, గుర్రం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, సంయుక్త కార్యదర్శి శ్రవణ్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.