Alleti Maheshwar Reddy | 22A లాంటి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా రేవంత్ సర్కార్ మరో కుట్రకు లేపుతూ శాసనసభ నుంచి సభ జరగనున్న అన్ని రోజులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్పుబట్టారు. శాసనసభలో ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సభలో లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేయడమనేది బాధాకరమన్నారు.
సభ్యులెవరైనా కానీ సభా ఉల్లంఘన జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన గొంతు, బాధ్యత మాపై ఉంది. కాబట్టి అడుగుతున్నం.. ఈ రోజు ఇష్టానుసారంగా మీరు సభలో నుంచి కొంతమంది సభ్యులను సస్పెండ్ చేయడం చాలా బాధాకరం. ఈ రోజు మీరు ఏ పుస్తకం ప్రకారం ఇలా చేశారు.. మరి కొత్తగా రేవంత్ రెడ్డి రూల్ బుక్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా..? మరి దేని కోసం ఈ సభలో ఈ రకంగా జరుగుతుందని ప్రశ్నించారు. అనేకమైన అంశాలున్నాయి వాటిని తీసుకోవాలి.. బీఏసీలో చర్చించినట్టుగా ఫీ రీయింబర్స్మెంట్ కానీ, 22 ఏ కానీ, కరెంట్ కష్టాలు.. అన్ని నియోజకవర్గాల్లో 7 గంటలు కూడా ఇవాళ కరెంట్ వస్తలేదు సార్ అంటూ వాపోయారు.
సభలో లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేశారు
ఇష్టానుసారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా సస్పెండ్ చేశారు? కొత్తగా రేవంత్ రెడ్డి రూల్ బుక్ వచ్చిందా?
– బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి https://t.co/YqHKoALy6n pic.twitter.com/PhoZwDXaEU
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2026