Ben Shelton: హోరాహోరీ పోరులో ఆల్కరాజ్ ఔట్.. యూఎస్ ఓపెన్ సెమీస్‌లోకి బెన్ షెల్టన్
US Open 2026: యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ క్వార్టర్స్‌లోనే అల్కరాజ్ ఇంటి దారి పట్టాడు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో యువ కెరటం బెన్ షెల్టన్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేశాడు. స్వంత ప్రేక్షకుల ముందు 5 సెట్ థ్రిల్లర్ గెలిచి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ నిష్క్రమించాడు. ఇవాళ హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అమెరికన్ ప్లేయర్ బెన్ షెల్టన్(Ben Shelton) అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. అయిదు సెట్ల థ్రిల్లింగ్ మ్యాచ్‌ను 6-7(5), 6-1, 6-3, 1-6, 7-6(7) స్కోరుతో షెల్టన్ గెలుచుకున్నాడు. మడిమ గాయం నుంచి కోలుకుని టోర్నీలో అడుగుపెట్టిన అల్కరాజ్.. ఈ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడు. సుమారు 4 గంటల 28 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది.
అల్కరాజ్పై తన కెరీర్లో తొలిసారి విజయం సాధించాడు బెన్. నాలుగు నెలల గాయం తర్వాత అల్కరాజ్ ఆడిన ఫస్ట్ టోర్నీ ఇదే. కానీ అతని ఆశలపై నీళ్లు చల్లాడు యువ ప్లేయర్ షెల్టన్. గాయం వల్ల స్పెయిన్ ప్లేయర్ అల్కరాజ్ సరైన రీతిలో తన సత్తాను ప్రదర్శించలేకపోయాడు. సమారు 52 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేశాడు. టై బ్రేకర్ వరకు వెళ్లిన తొలి సెట్‌ను అల్కరాజ్ చివరకు సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత చాలా భీకరంగా షెల్టన్ చెలరేగిపోయాడు.
రెండవ, మూడవ సెట్లను బెన్ ఈజీగా నెగ్గేశాడు. ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆకట్టుకున్నాడు. కానీ నాలుగో సెట్లో అల్కరాజ్ తన రిథమ్‌ను మళ్లీ అందుకున్నాడు. బేస్‌లైన్ షాట్లు, స్పీడ్‌తో ఆ సెట్‌ను 6-1 తేడాతో నెగ్గి మ్యాచ్‌ను డిసైడర్ సెట్లోకి పంపాడు. ఇక ఆ ఫైనల్ సెట్లో ఇద్దరూ అమీతుమీ అన్నట్లుగా ఆడారు. సూపర్ టైబ్రేక్‌కు ఆ సెట్ వెళ్లింది. స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షిస్తున్న ప్రేక్షకులు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. కానీ చివరకు బెన్ షెల్టన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. 10-7తో టైబ్రేక్ సాధించాడు. దీంతో అతను రెండోసారి గ్రాండ్‌స్లామ్ సెమీస్‌లోకి ప్రవేశించాడు.
న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో క్వార్టర్స్ మ్యాచ్‌ను ఆలస్యంగా ప్రారంభించారు. దీనికి తోడుగా 4 గంటలకు పైగా మ్యాచ్ సాగడం వల్ల.. తెల్లవారుజామున మూడున్నరకు మ్యాచ్ ముగిసింది.
Ben Shelton scores the biggest win of his career and a spot in the US Open semifinals! pic.twitter.com/2PCndRLcpL
— US Open Tennis (@usopen) September 9, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

