గాంధీనగర్: బహుళ అంతస్తుల భవనాల్లో ఉన్న వస్త్ర మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో పలు షాపులు దగ్ధమయ్యాయి. 150 మంది అగ్నిమాపక సిబ్బంది 25 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపుచేశారు. ఒక అగ్నిమాపక సిబ్బంది గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Fire At Surat Textile Market) గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం తెల్లవారుజామున బహుళ అంతస్తుల వస్త్ర మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్యామ్ సంగిని వస్త్ర మార్కెట్లో చెలరేగిన మంటలు పలు షాపులకు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో 12కు పైగా బట్టల షాపులు దగ్ధమయ్యాయి. ఆరో అంతస్తులోని వస్త్ర దుకాణాల బయట ఉంచిన సింథటిక్ వస్తువులు మంటల్లో పూర్తిగా కాలిపోయాయని, దీంతో మంటలు ఇతర షాపులకు వ్యాపించాయని వస్త్ర వ్యాపారులు తెలిపారు.
కాగా, ఈ అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే 25 అగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరుకున్నాయి.
150 మంది అగ్నిమాపక సిబ్బంది హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్‌లు, నిచ్చెనల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సుమారు 8 గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ఆపరేషన్‌లో ఒక అగ్నిమాపక సిబ్బంది గాయపడగా అతడి ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
सूरत के टेक्सटाइल मार्केट में लगी भीषण आग
गुजरात के सूरत के सरोली इलाके में बुधवार तड़के एक टेक्सटाइल मार्केट में भीषण आग लग गई. आग मार्केट की ऊपरी मंजिलों तक फैल गई, जिसके बाद फायर विभाग ने 13 फायर स्टेशनों से 15 से ज्यादा दमकल गाड़ियां मौके पर भेजीं. अब तक किसी के हताहत होने… pic.twitter.com/5rKX7BkZdm
— zingabad (@zingabad) September 9, 2026