Revanth Reddy | కొడంగల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.