Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
Harish Rao | ఈ ప్రభుత్వం వైఫల్యం వల్ల. చిత్తశుద్ది లేకపోవడం వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయి. పాలమూరు ద్రోహి రేవంత్ రెడ్డి. పాలమూరులో నువ్వు శ్రీశైలంలో నీళ్లు ఎత్తకపోవడం వల్ల పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతున్నయి.
Harish Rao | చంద్రబాబు నాయుడు కృష్ణానదీ జలాలను 700 కిలోమీటర్లు తీసుకెళ్లి కుప్పంలో తన నియోజకవర్గంలో నీళ్లు పారిస్తున్నడు. మరి అదే కృష్ణాలో నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నువ్వు విడిచిపెడితే చంద్రబాబు ఒడిసి పడ్తున్నడు. 700 కిలోమీటర్ల దూరంలో ఇవాళ కుప్పంలో గళగళా కృష్ణానదీ జలాలుపారుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు జలహారతి ఇస్తున్నాడు. అంటే నీ గురువు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నవా..? రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు.
నిన్న చంద్రబాబు ట్వీట్.. గోదావరి నుంచి 500 టీఎంసీల నీళ్లు నేను పట్టిసీమ ద్వారా ఇప్పటిదాకా ఎత్తిన అని.. పట్టిసీమ నీళ్లెత్తి కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలకు, డెల్టాకు ఇవాళ ఏపీ నీళ్లు పారిస్తుంది.. ఎందుకు అక్కడనేమో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ బంద్ పెడితే.. కిందికెళ్లి ఆయన శ్రీశైలంకెళ్లి వెలిగొండకు తీసుకెళ్తున్నడు. కుప్పం తీసుకుపోతున్నడు.. ఇక్కడ గోదావరిలో కన్నెపల్లిలో కటుక ఒత్తుమంటే.. నిన్నటిదాకా ఎన్డీఎస్ఏ పేరు చెప్పి తప్పించుకున్నవ్. దేవాదుల దగ్గర కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టు ఉంది.
24 గంటలు మోటార్లు నడుపవయా అంటే నేను 8 గంటలే మోటార్లు నడుపుతా అంటడు. నీళ్లు లేక కాదు ఇది.. ఈ ప్రభుత్వం వైఫల్యం వల్ల. చిత్తశుద్ది లేకపోవడం వల్ల ఇవాళ కరువు పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పాలమూరు ద్రోహి రేవంత్ రెడ్డి. పాలమూరులో నువ్వు శ్రీశైలంలో నీళ్లు ఎత్తకపోవడం వల్ల పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతున్నయి. వెలిగొండకు నీళ్లు పోతున్నయి. కుప్పంకు నీళ్లు పోతున్నయ్.. ఎందుకు 24 గంటలు మోటార్లు నడుపుతలేవు అని ప్రశ్నించారు. ఏపీలో లేని కరువు తెలంగాణలో ఎందుకు ఉంది..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే ఈరోజు తెలంగాణలో కరువు పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ నుంచి కృష్ణా, గోదావరి నదులు పారుతుంటే రేవంత్ రెడ్డి నీటిని వదిలిపెడుతున్నాడు, చంద్రబాబు ఒడిసిపడుతున్నాడని అన్నారు.
ఏపీలో లేని కరువు తెలంగాణలో ఎందుకు ఉంది?
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే ఈరోజు తెలంగాణలో కరువు పరిస్థితులు ఉన్నాయి
తెలంగాణ నుంచి కృష్ణా, గోదావరి నదులు పారుతుంటే రేవంత్ రెడ్డి నీటిని వదిలిపెడుతున్నాడు, చంద్రబాబు ఒడిసిపడుతున్నాడు
గురు దక్షిణ చెల్లిస్తున్నావా రేవంత్ రెడ్డి?
700 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకెళ్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు
పట్టిసీమ ద్వారా 500 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశానని చంద్రబాబు ట్వీట్ వేశాడు
రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ కాదు, పాలమూరు ద్రోహి
– హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) October 12, 2026
Read Also :
Kalvala Project | కన్నీటి మడుగులా ‘కల్వల ప్రాజెక్ట్’..!.. మూడేళ్లుగా మరమ్మతులకు పడని అడుగులు
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

