కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
వరంగల్- ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన బీఆర్ఎస్కే ఆ హక్కు ఉందని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు.
ధర్మసాగర్ : వరంగల్- ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన బీఆర్ఎస్కే ఆ హక్కు ఉందని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో గుండాగిరి, ఫ్యాక్షనిస్టు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు సాగునీరు, విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రైతులను పంటలు సాగు చేసుకోవద్దని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి కప్పం కట్టేందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
దేవాదుల లిఫ్ట్ పనులలో నిర్లక్ష్యం ఎందుకు ?
కాంట్రాక్టర్ల కమిషన్ కోసమే దేవాదుల లిఫ్ట్ పనులలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్లక్ష్యం వహిస్తున్నారని రాజయ్య విమర్శలు గుప్పించారు. కడియం శ్రీహరి దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్త కాదని, దేవాదుల వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.104 కోట్లతో మూడు లిఫ్టులకు శంకుస్థాపన చేసినప్పటికీ, ప్రస్తుత ఎమ్మెల్యే ఒక్క లిఫ్టును కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు.
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. కమీషన్ల సొమ్మును దాచుకోవడానికే కడియం శ్రీహరి విదేశీ పర్యటనలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను పట్టభద్రులు గుర్తించి, ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రాజయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కర్ర సోమిరెడ్డి, రాంగోపాల్ రెడ్డి, నాయకులు లక్క శ్రీనివాస్, గుర్రపు ప్రవీణ్, గంటే బాలకుమార్, కొలను రాజు, కుమారస్వామి, చేరాలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

