Kalvala Project | కన్నీటి మడుగులా ‘కల్వల ప్రాజెక్ట్’..!.. మూడేళ్లుగా మరమ్మతులకు పడని అడుగులు
ఒకప్పుడు శంకరపట్నం, వీణవంక మండలాల పచ్చని పొలాలకు జీవనాడిలా భాసిల్లిన కల్వల ప్రాజెక్టు నేడు అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల ఉదాసీనత వల్ల తీవ్ర నిరాదరణకు గురవుతోంది. రెండేళ్ల క్రితం ప్రాజెక్టు మత్తడి వద్ద పడిన గండి నేటికీ పూర్తిస్థాయి మరమ్మతులకు నోచుకోవడం లేదు.
- వృథాగా జారిపోతున్న చెరువు నీళ్లు
- ఆందోళనలో శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట మండలాల ఆయకట్టు రైతాంగం..
- వట్టిపోతున్న 1200 ఎకరాలకు సాగు భూములు
- శాశ్వత మరమ్మతులు చేసి కాపాడాలని రైతులు, మత్స్యకారుల డిమాండ్
Kalvala Project | శంకరపట్నం, అక్టోబర్ 12 : ఒకప్పుడు శంకరపట్నం, వీణవంక మండలాల పచ్చని పొలాలకు జీవనాడిలా భాసిల్లిన కల్వల ప్రాజెక్టు నేడు అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల ఉదాసీనత వల్ల తీవ్ర నిరాదరణకు గురవుతోంది. రెండేళ్ల క్రితం ప్రాజెక్టు మత్తడి వద్ద పడిన గండి నేటికీ పూర్తిస్థాయి మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో వర్షపు నీరు వచ్చినా వచ్చినట్లే వృథాగా బయటకు పోతోంది. నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం కోల్పోయి ప్రాజెక్టు బాటలు ఖాళీగా దర్శనమిస్తుండటంతో, వానాకాలం సాగు సీజన్ మొదలైనా ఆయకట్టు రైతులు, మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై 28, 2023న కురిసిన భారీ వర్షాల ధాటికి మొదటగా కల్వల ప్రాజెక్టు మత్తడి వద్ద గండి పడి, కోతకు గురైంది.
తాత్కాలిక చర్యలు..
అప్పట్లో అధికారులు రింగ్‌బండ్ వేసి తాత్కాలికంగా మరమ్మతులు పూర్తిచేశారు. అనంతరం మరోసారి గండి పడింది. గత ఏడాది సాగు అవసరాల సమయంలో ప్రాజెక్టుకు మళ్లీ గండి పడటంతో, ఒక్క చుక్క నీరు కూడా నిలవకుండా ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయింది.
రైతుల శ్రమ వృథా..
నీళ్లు నిలిచే పరిస్థితి లేకపోవడంతో, ఆయకట్టు రైతులే స్వయంగా పూనుకొని ట్రాక్టర్ల ద్వారా ఇసుక బస్తాలు అడ్డుగా వేసి తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ, వరద ఒత్తిడికి ఫలితం లేకుండా పోయింది.
12వందల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం-ఆరిపోతున్న ఆశలు
ప్రాజెక్టులో నీటి నిల్వ లేకపోవడంతో శంకరపట్నం, వీణవంక మండలాల పరిధిలోని దాదాపు 1,200 ఎకరాల ఆయకట్టు రైతాంగానికి సాగు నీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. అలాగే ప్రాజెక్టుపై ఆధారపడి జీవనోపాధిని పొందుతున్న మత్స్యకారుల కుటుంబాలు ఉపాధిని కోల్పోతుండగా, మరోవైపు ప్రాజెక్టు దిగువన ఉన్న 5 చెక్‌డ్యామ్‌లకు నీటి ఊట లేక అవి కూడా ఎండిపోవడంతో, ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. ఫలితంగా భవిష్యత్ పంటల సాగుపై తీవ్ర సందేహాలు నెలకొన్నాయి.
ప్రాజెక్టు ఎండిపోవడాన్ని అదనపు అవకాశంగా మలుచుకున్న కొంతమంది అక్రమార్కులు, ప్రాజెక్టు శిఖం (ముంపు) భూములను ఆక్రమించేందుకు పూనుకుంటున్నారు. గడిచిన రెండేళ్లుగా కొంతమంది ఇష్టారీతిన ట్రాక్టర్లతో ప్రాజెక్టు భూములను చదును చేస్తూ అక్రమంగా సాగు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల గద్దపాక గ్రామానికి చెందిన కొందరు రైతులు ట్రాక్టర్లతో ప్రాజెక్టు శిఖంలో చదును చేస్తుండగా, సమాచారం అందుకున్న ఎస్సారెస్పీ నీటిపారుదల శాఖ అధికారులు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకుని, ట్రాక్టర్లను వెనక్కి పంపించివేశారు.
హామీలు నీటిమూటలేనా..?
గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుకు గండి పడిన సమయంలో నాటి నాయకులు, అధికారులు ప్రాజెక్టు సందర్శనకు వచ్చి భారీగా నిధులు కేటాయిస్తామని, శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టును ‘మిని ఎల్ఎండి’గా మారుస్తామని హామీలు ఇచ్చారు. కానీ, తదనంతరం బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల అంశం ముందుకు పడలేదు.
అధికార మార్పిడితో తమ ప్రాజెక్టు ప్రక్షాళన అటకెక్కిందని ఆయకట్టు రైతులు, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి తక్షణమే ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని శంకరపట్నం, వీణవంక మండలాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

