హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు రేవంత్‌రెడ్డి పెద్దమ్మతల్లి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడినుంచి ర్యాలీగా గాంధీభవన్‌కు చేరుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి కాంగ్రెస్ జెండా అందుకోవడం ద్వారా రేవంత్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.