భోపాల్, జూలై 8 : సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ఆటో లో దవాఖానకు వెళ్తూ ఒక మహిళ నలుగురు కవలలకు జన్మనిచ్చిన ఘటన బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో జరిగింది. అయితే నలుగురు ప్రీమెచ్యూర్ బేబీలు పుట్టిన కొద్దిసేపటికే మరణించారు. మాండ్ల జిల్లా నైనగ్వాలో మంగళవారం ఈ ఘట న చోటుచేసుకుంది. ఏడో నెల గర్భ ంతో ఉన్న 28 ఏండ్ల రజినీ సింగారానికి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కోసం ప్రయత్నించారు.
అయితే అంబులెన్స్ రాకపోవడం తో ఆటోలో దవాఖానకు వెళ్తుండగా, నొప్పులు వచ్చి నలుగురు కవలలకు ఆటోలోనే జన్మనిచ్చింది. అయితే నలుగురు బిడ్డలు మరణించారని డాక్టర్లు ప్రకటించారు. సమయానికి అంబులెన్స్ రాకపోవడం వల్లే తన భార్య నలుగురు శిశువులను పోగొట్టుకున్నదని, దీనికి ప్ర భుత్వ సేవా లోపమే కారణమని బాధితురాలి భర్త ఆరోపించారు.