‘తొలి నిర్ణయం ప్రకారమే కోదాడ మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలి’
శంషాబాద్ నుండి చెన్నై వరకు నడవనున్న బుల్లెట్ ట్రైన్ ను చిట్యాల, సూర్యాపేట, కోదాడ నుండి తొలి నిర్ణయం ప్రకారమే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కోదాడ ఎమ్మెస్ కళాశాలలో నిర్వహించిన...
కోదాడ, జూలై 30 : శంషాబాద్ నుండి చెన్నై వరకు నడవనున్న బుల్లెట్ ట్రైన్ ను చిట్యాల, సూర్యాపేట, కోదాడ నుండి తొలి నిర్ణయం ప్రకారమే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కోదాడ ఎమ్మెస్ కళాశాలలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మల్లేపల్లి, హాలియా మీదుగా నడిచేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఎంతో కాలం నుండి రైలు మార్గం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. నిర్ణయం మార్చుకోకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు డేవిడ్ కుమార్, మేకల శ్రీనివాస్, ఎస్.కె నయీమ్, ముత్యాలు, అనసూర్య, వెంకటనారాయణ, నరసింహారావు, దొడ్డ వెంకటయ్య, రామ నరసయ్య, పోనుగోటి కోటయ్య, ఉదయగిరి, లతీపు, స్వామి, ఎస్ఎస్ రావు, జెఆర్ మూర్తి , ముత్తవరపు రామారావు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

