వాషింగ్టన్, జూలై 8 : హెచ్-1బీ, పెర్మ్ వర్క్ వీసాలకు సంబంధించిన మోసం ఆరోపణలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తన మొదటి సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. ఈ వివరాలను ఫెడరల్ అధికారి బుధవారం తెలియచేస్తూ కాగ్నిజెంట్ పేరును వెల్లడించారు. దర్యాప్తు అధికారులు ఇప్పటికే డజన్ల కొద్దీ సమన్లు జారీచేశారని అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పోసిటో ఫాక్స్ బిజినెస్‌కు తెలిపారు.
హెచ్-1బీ వీసాలకు సంబంధించిన ఆందోళనలపై అధికారులు ప్రత్యేకంగా కాగ్నిజెంట్‌ను ప్రస్తావిస్తూ కొన్ని అతిపెద్ద కంపెనీల సమాచారాన్ని అందుకున్నారని వెల్లడించారు. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు చెందిన మోసాల నివారణ టాస్క్ ఫోర్స్‌తో కలసి పనిచేయనున్నాము అని ఆయన చెప్పారు.