Kodangal | కొడంగల్ : కొడంగల్లో రేవంత్ రెడ్డి అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్తలు, వాహనాలపై రేవంత్ అనుచరులు దాడులకు పాల్పడ్డారు. కొడంగల్ నియోజకవర్గం సర్జాఖాన్పేటలో దౌర్జన్యానికి పాల్పడ్డారు.
మహిళా కార్యకర్తలపై కూడా రేవంత్ అనుచరులు దాడులకు తెగబడ్డారు. బీఆర్ఎస్ వాహనాలను ధ్వంసం చేసి, హంగామా సృష్టించారు. బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి సెల్ఫోన్లు, ఇతర వస్తువులను లాక్కున్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కేటీఆర్ రోడ్ షోను చూసి రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది అని తెలిపారు.