హిమాయత్‌నగర్, మార్చి 15: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న రాష్ట్రమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొల్లాపూర్ బహిరంగ సభలో మంత్రిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గౌడ సంఘాల నాయకులు బబ్బురిగౌడ్, రవీందర్‌గౌడ్, అనిల్‌గౌడ్, ప్రసాద్‌గౌడ్, రాజన్నగౌడ్, ప్రశాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.