హైదరాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ): ఫ్యూచర్‌సిటీ భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. శనివారం పరిశ్రమల శాఖపై మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నిమ్జ్‌లో మిగిలి ఉన్న భూసేకరణకు రైతులతో మాట్లాడి ఒప్పించాలని ఆదేశించారు.
డాటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పెట్టుబడుల కోసం రాష్ర్టానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవరూ వెనకి వెళ్లడానికి వీల్లేదని సూచించారు. 2025లో ఇప్పటికే 25 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు వచ్చాయని, మరిన్ని సెంటర్లు వచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ క్యాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.