Revanth Reddy | 2034 వరకూ నేనే ముఖ్యమంత్రి.. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తా..!
Revanth Reddy : ఎన్నికల హామీలు, ఆరు గ్యారంటీల అమలులో విఫలమవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) 'వే టు న్యూస్ కాన్ క్లేవ్ - 2026'లో మాత్రం గొప్పలకు పోయారు.
Revanth Reddy : ఎన్నికల హామీలు, ఆరు గ్యారంటీల అమలులో విఫలమవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ‘వే టు న్యూస్ కాన్ క్లేవ్ – 2026’లో మాత్రం గొప్పలకు పోయారు. 2034 వరకే తానే తెలంగాణ సీఎం అని, రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో తనకు చాలా చొరవ ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు అధిష్టానం గీసిన గీతను తాను దాటనని రేవంత్ చెప్పారు.
‘వే టు న్యూస్ కాన్ క్లేవ్ – 2026’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీలో పనిచేసిన రోజులను, చంద్రబాబు నాయుడితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేను 10 ఏళ్లు టీడీపీలో పనిచేశాను. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నన్ను గౌరవిస్తారు. పార్టీని వదిలిపెట్టిన తర్వాత నాయకుల మధ్య మంచి సంబంధాలు ఉండటం చాలా అరుదు. టీడీపీని వీడే సమయంలో విజయవాడకు వెళ్లి చంద్రబాబుకు చెప్పి వచ్చాను. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని రాహుల్ గాంధీకి లక్ష్యం ఉంది.
Honourable Chief Minister Sri. A @revanth_anumula attended the way2news Conclave. pic.twitter.com/hIIpWZlBDR
— IPRDepartment (@IPRTelangana) May 15, 2026
కానీ, ఆయనకు ప్రధాని కావాలన్న లక్ష్యం లేదు. అయితే.. వికారాబాద్ సమావేశంలో ప్రధాని పదవి తీసుకోవాలని నేనే రాహుల్ గాంధీకి చెప్పి ఒప్పించాను. ఇప్పుడు జనం స్విగ్గీ పాలిటిక్స్ కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీనే. ముందుగా కాంగ్రెస్ తరఫున ప్రకటించి తర్వాత ఇండియా కూటమిని ఒప్పిస్తాం. ఇండియా కూటమి తరుపున ఒక పాలసీ డాక్యూమెంటును తీసుకువచ్చి దేశ ప్రజలను తీర్పు ఇవ్వమని కోరతాం. 2024 నుంచి 2034 వరకు ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తారు అని పేర్కొన్నారు.
Live : Chief Minister Revanth Reddy at the Way2News Conclave 2026,Hyderabad https://t.co/9cPypGc75c
— Revanth Reddy (@revanth_anumula) May 15, 2026
అంతేకాదు 2034 వరకు తాను తెలంగాణలోనే ఉంటానని, ఇక్కడి ప్రజల కోసమే పనిచేస్తానని సీఎం రేవంత్ వెల్లడించారు. ‘2034 వరకూ నేను తెలంగాణలోనే ఉంటా. తెలంగాణ నుంచి పది శాతం జీడీపీని దేశానికి ఇచ్చేలా పనిచేస్తా. మరో విషయం .. 2034 వరకు నేనే ముఖ్యమంత్రి. 2034 తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉండను. తర్వాతి తరానికి అవకాశం ఇస్తా. దేశానికి కూడా సేవలందిస్తా. నా అనుభవాన్ని దేశం కోసం పంచుతా. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి ఆయన ఇచ్చిన ఛైర్లోలో నేను కూర్చుంటాను’ అని రేవంత్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

