హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ‘సర్’ కారణంగా దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని, మన రాష్ట్రంలో కూడా ఎకడో ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘సర్’ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతున్నదని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలువాలనుకునే ప్రతీ ఒకరూ ఓటు హకును కాపాడే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
మనం చేసిన జనగణన దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని, ఇది రాష్ట్రం సాధించిన ఘనత అని పేర్కొన్నారు. జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం సభను సజావుగా జరుగకుండా కుట్ర చేస్తున్నదని, ఇటీవలి సంఘటనలపై విచారణ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ చర్చల్లో సభ్యులు పాల్గొనాలని ఆదేశించారు.