హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 30 : కాకతీయ యూనివర్సిటీ పరిరక్షణకు ఏబీవీపీ ఆధ్వర్యంలో 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు. బుధవారం కేయూ ఎస్డీఎల్సీఈ ప్రాంగణంలో ‘సేవ్ కాకతీయ యూనివర్సిటీ’ పేరుతో ఫీజులు, స్కాలర్షిప్లు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, అధ్యాపక పోస్టులు, వసతులు వంటి అనేక విద్యార్థి సమస్యల మీద నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ర్ట కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ యూనివర్సిటీలో భవనాలు, మౌలిక వసతులు, అధ్యాపకుల జీతాలు తదితరాలకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నప్పటికీ విద్యార్థులపై ఫీజుల భారం ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అనుగుణంగా కాకుండా విద్యార్థుల నుంచి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై యూనివర్సిటీ యాజమాన్యం స్పష్టత డిమాండ్ చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం 48 గంటల్లో స్పందించి డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి దీపిక, స్టేట్ యూనివర్సిటీస్ ప్రముఖ్ అంబాల కిరణ్, యూనివర్సిటీ ఇంచార్జ్ నిమ్మల రాజేష్, సాయికుమార్, వీక్షిత, అఖిల్, వినోద్, రమేష్, పవన్ కళ్యాణ్, సారిక విద్యార్థులు పాల్గొన్నారు.