స్కూళ్లు మూసివేస్తే అగ్నిగుండమే
రాష్ట్రంలో 23వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ, విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
- బడుగుబలహీన వర్గాలపై ముఖ్యమంత్రి భారీ కుట్ర
- పిచ్చితుగ్లక్ పాలనను మించిపోతున్న రేవంత్: ఎంపీ ఆర్ కృష్ణయ్య
రవీంద్రభారతి, జూన్ 14: రాష్ట్రంలో 23వేల Government schoolను మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ, విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రేవంత్రెడ్డి పాలన పిచ్చి తుగ్లక్ పాలనను మించిపోతున్నదని, తక్షణమే రేవంత్ సీఎం పదవికి రాజీనామాచేసి బడుగు బలహీన వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదివారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత నీల వెంకటేశ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి సభా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి విద్యాశాఖను తన గుప్పిట్లో పెట్టుకొని విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను చదువుకోకుండా, కార్పొరేట్ విద్యాసంస్థల కొమ్ముకాస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బడిలేని ఊరు ఉంటుందా..? అని ప్రశ్నించారు. ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కమిషన్లు వేస్తూ.. మరోవైపు 23వేల ప్రభుత్వ పాఠశాలలను రద్దు చేసి 4వేల పాఠశాలలతోనే విద్యావ్యవస్థను నడిపిస్తామనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ధ్వజమెత్తారు.
విద్యార్థులు లేరనే సాకుతో స్కూళ్లను మూసివేస్తామని చెప్పడం సరికాదని, విద్యార్థులు ఎందుకు లేరో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకనే విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్నారని, ఇది ప్రభుత్వం చేస్తున్న తప్పిదం కాదా..? అని ప్రశ్నించారు. స్కూళ్ల మూసివేత ప్రతిపాదనను ఉపసంహరించుకోకపోతే జూలై 1 నుంచి అన్ని పాఠశాలల విద్యార్థులతో కలిసి భారీ ఉద్యమాన్ని చేపడుతామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు రామ్దేవ్మోదీ, సీ రాజేందర్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

