రేవంత్‌రెడ్డిది ప్రైవేట్ ఫ్రాంచైజీ పాలన
తెలంగాణలో సాగుతున్నది కాంగ్రెస్ సిద్ధాంతాల పాలన కాదని, ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నడిచే ‘ప్రైవేట్ ఫ్రాంచైజీ పాలన‘ అని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాశారు.
- ఇది ప్రధాని మోదీ ఆదేశాల ప్రకారం నడిచే సరార్
- రాహుల్‌గాంధీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సాగుతున్నది కాంగ్రెస్ సిద్ధాంతాల పాలన కాదని, ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నడిచే ‘ప్రైవేట్ ఫ్రాంచైజీ పాలన‘ అని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో మోదీ సర్కార్ తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీని తెలంగాణ క్యాబినెట్ ఆమోదించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనుసరిస్తున్న విధానానికి, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అస్సలు పొంతనలేదని దాసోజు శ్రవణ్ తన లేఖలో ఎండగట్టారు. వీబీజీ రామ్ జీ బిల్లును పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ వ్యతిరేకించారని గుర్తుచేశారు. తెలంగాణలో మాత్రం ఈ చట్టాన్ని ఆమోదించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నదని పేరొన్నారు. ఇది కేంద్రంలోని బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న లోపాయికారీ ఒప్పందానికి ప్రత్యక్ష నిదర్శనమని ఆయన ఆరోపించారు.
ఇతర రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి
కాంగ్రెస్ పాలిత కర్ణాటక ప్రభుత్వం ఈ చట్టాన్ని క్యాబినెట్లో తిరసరించడమే కాకుండా, సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి నిరసన తెలిపిందని చెప్పారు. ఈ విధానం వల్ల రాష్ట్ర బడ్జెట్ పై రూ.5వేల కోట్లకు పైగా అదనపు భారం పడుతుందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల ప్రధానికి లేఖ రాశారని గుర్తుచేశారు. తెలంగాణ మాత్రం మోదీ-అమిత్ షా ఆదేశాలకు లొంగిపోయిందని దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

