Revanth Reddy | పాలన తక్కువ పర్యటనలు ఎక్కువ అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యవహారం ఉన్నది. పైసా పనులు జరుగకపోయినా ఢిల్లీ-హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఏడాదిన్నర కాలంలో ఇప్పటికే 49 సార్లు ఢిల్లీకి వెళ్లివచ్చిన రేవంత్.. తాజా మరోసారి పర్యటనకు సిద్ధమయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ విమానం ఎక్కనున్నారు. శనివారం ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) లా, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగనున్న కాంక్లేవ్‌లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. శనివారం సాయంత్రం మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు.
కాగా, జూలై 24న ఢిల్లీకి వెళ్లిన ఆయన మూడు రోజులపాటు అక్కడే ఉన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అగ్రనేత రాహుల్ గాంధీకి వివరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని రాష్ర్టాల ఎంపీలకు బీసీ రిజర్వేషన్లపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.