సూర్యాపేట, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనతో ఓ పక్క రాష్ర్టాన్ని లూటీ చేస్తుండగా మరో పక్క కేసీఆర్ అమలు చేసిన పథకాలను నిలిపివేసి ప్రజలను బాధపెడుతున్నదని మా జీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూముల్లో నిబంధనలన్నీ అతిక్రమిస్తుండటంతో భూములను విక్రయిస్తున్న వారు, కొనుగోలు చేసేవారు జైలు పాలు కావడం ఖాయమని హెచ్చరించారు. సోమవారం సూర్యాపేట బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వాస్తవానికి తెలంగాణ ఇండస్ట్రీకి ప్రభుత్వ భూములు తీసుకున్నా ..ప్రైవేట్ భూములు ఆక్రమించుకున్నా వాళ్లు ధరలు నిర్ణయించి విక్రయిస్తారని చెప్పారు. కొత్తగా సబ్ రిజిస్ట్రార్ వాల్యూ అని చెప్పడం పూర్తిగా అక్రమమే అని తెలిపారు. ఓ వైపు కోకాపేటలో ప్రభుత్వ భూమిని వేలం వేయంగా 100కోట్లు వచ్చాయని చెబుతూ.. అదే ప్రభుత్వభూమిని ఇక్కడ కోటి రూపాయలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చారు. ధాన్యం, పత్తి కొనుగోళ్ల విషయంలో రైతాంగం మోసాలకు గురవుతున్నదని చెప్పారు. బీఆర్ఎస్ రైతులు, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టంచేశారు.
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): హిల్ట్ అనే ది పాలసీ కాద ని.. లక్షల కోట్ల భూ కుంభకోణమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఐదు లక్షల కో ట్ల విలువ చేసే భూములను కాజేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రగా అభివర్ణించారు.

మూసీ భూములు, మెట్రో భూములు, లగచర్ల భూములు, సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు 9,292 ఎకరాల భూములపై సీఎం కన్ను పడిందని మండిపడ్డారు. ఆయన దృష్టంతా రియల్ఎస్టేట్పై ఉందని అన్నారు.