KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పదే పదే చెబుతున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని, తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణ ఫార్మా సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ లేని నాయకుడని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజాధనం వృథా అవుతోందన్నారు. ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు.
ఇది నిర్లక్ష్య నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందో దానికి ఫ్యూచర్ సిటీ ప్రచారం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. ఒక నిర్దిష్ట ప్రజా ప్రయోజనం కోసం సేకరించిన భూమిని ఇతరుల ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించడం సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని ఉటంకిస్తూ తాను రెండేళ్ల క్రితమే అసెంబ్లీలో ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించానని గుర్తుచేశారు. అయినా, రేవంత్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు పీఆర్ కోసం ఖర్చు చేసి, ఇప్పుడు తీవ్రమైన న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంటోందని, చివరికి అధికారులు కూడా దీన్ని అంగీకరిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 20వేల ఎకరాలతో ప్రతిపాదనలను తయారు చేసిందని.. స్థానిక రైతులు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వచ్చి తమ భూములను హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.
కొంతమంది తమ భూములు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించిన ప్రతి ఎకరాన్ని తిరిగి రైతన్నలకు ఇస్తామని హామీలు ఇచ్చి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు స్నేహితుల కోసం అవే భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వారిని నిండా మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలు ఫార్మా కంపెనీల కోసం కేటాయించిన భూముల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఫార్మా సిటీ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనంతో మౌలిక వసతుల కల్పనను ప్రారంభించినా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిని పక్కనపెట్టి, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో భూములను అక్రమంగా రియల్ ఎస్టేట్‌కు మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని, దాంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు నష్టపోతారని కేటీఆర్ హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని హెచ్చరించారు.
No Future for this so-called “Future City”!
A classic example of what happens when a clueless leader runs the State
Revanth first scrapped Hyderabad Pharma City, then floated an imaginary Future City on the same lands
As per the Land Acquisition Act 2013, land acquired for a… pic.twitter.com/YiWXvpr42F
— KTR (@KTRBRS) August 17, 2025