హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత మున్సిపాల్టీలపై ఉన్నదని, ఈ విషయంలో మున్సిపల్ అధికారులు సాకులు చెప్పి తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టం చేసింది. పక్క కాలనీలోని వారు అభ్యంతరం చెప్తున్నారన్న కారణంతో డ్రైనేజీ నిర్మాణాన్ని మధ్యలోనే ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించింది.
ఆ కాలనీవాసుల్ని ఒప్పించి డ్రైనేజీ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, తద్వారా మల్కాజిగిరిలోని అనంత సరస్వతి నగర్ ప్రజల సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన జస్టిస్ కే లక్ష్మణ్.. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు.
ఎస్సీ వర్గీకరణను సాగదీయొద్దు: మోత్కుపల్లి
ఖైరతాబాద్, జనవరి 25: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కాకుంటే ప్రభుత్వం పనిపడుతామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా మోత్కుపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మందకృష్ణ మాదిగ చేపట్టిన 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటాన్ని సుప్రీంకోర్టు గుర్తించి బృహత్తరమైన తీర్పునిచ్చింది. కానీ వర్గీకరణ ఆలస్యమవుతున్నది. ఇప్పటికైనా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి.