బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 04:02:42

దేశాభివృద్ధిలో పీవీది కీలక పాత్ర

దేశాభివృద్ధిలో పీవీది కీలక పాత్ర

  • పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనమండలిలో తీర్మానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశాభివృద్ధిలో పీవీ నరసింహారావుది కీలకపాత్ర అని, ప్రధానిగా ఆయన భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి వైపు నడిపించారని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మం త్రులు ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురు ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. పీవీని భారతరత్నగా ప్రకటించాలని, పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని, చిత్తరువునూ ప్రతిష్ఠించాలని, హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తూ శాసనమండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. శాసనమండలిలో మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.  మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌, పురాణం సతీశ్‌, రాంచందర్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు, జీవన్‌రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు చర్చలో పాల్గొన్నారు.


logo