Nallagonda | నల్లగొండ : కేతేపల్లి మండల పరిధిలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థికి పాముకాటుకు గురయ్యాడు. అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది.. బాధిత విద్యార్థిని నకిరేకల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ విద్యార్థికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే 24 గంటలు గడిస్తే గాని ఏం చెప్పలేం అని వైద్యులు పేర్కొన్నారు. దీంతో బాధితుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థి గణేశ్ ఏడో తరగతి చదువుతున్నాడు.
స్కూల్ పరిసర ప్రాంతాల్లో పాములు, తేళ్లు సంచరిస్తున్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇటీవలే ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే ఏం చేయాలో తమకు తెలుసని ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు సమాచారం. ఇవాళ్టి ఘటనతో మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీని రైతులు తరిమికొట్టేలా ఉన్నారు : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
KTR | లోడ్ పెరిగిందంటూ ట్రాన్స్ఫార్మర్ల భారం అపార్ట్మెంట్ వాసులపై వేస్తారా? : కేటీఆర్