, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీసీలకు జనాభా దామాషా ప్రకా రం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్హాల్లో బీసీ సంఘాలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడా రు. ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు లెకల ప్రకా రం చూసినా రాష్ట్రంలో బీసీలు 46శాతం ఉన్నారని, రీ సర్వే చేస్తే మరో 1.5 లేదా 2 శాతం పెరుగుతారని తెలిపారు. ఆ లెక్కన బీసీ లు 48శాతం ఉంటే… ఏ ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ విద్యా, ఉపాధి రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే న్యా యపరమైన చికులు వస్తాయని అభిప్రాయపడ్డారు.
ఏ ఒక అంశంపై ఎవరైనా కోర్టుకు వెళ్తే మొత్తం బిల్లు చెల్లకుండాపోతుందని హె చ్చరించారు. వేర్వేరు బిల్లులను పెట్టాలని డి మాండ్ చేశారు. ముస్లింలు, బీసీలకు కలిపి 56 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. రిజర్వేషన్ల విషయంలో హిందువులు, ముస్లింల మధ్య బీజేపీ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంతగానో కృషి చేసిందని, అందు లో భాగంగానే పార్టీ పదవుల్లో ఆ వర్గాల వారి కి 51 శాతం అవకాశాలు కల్పిస్తున్నదని గుర్తుచేశారు. తెలంగాణ జాగృతి సంస్థ బీసీలకు న్యాయం కోసం పోరాటం చేస్తుందని, సామాజిక దృక్పథంతో పనిచేస్తున్నదని చెప్పారు.
అక్రమ కేసులకు తలొగ్గేదే లేదు..
ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తల ను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన బీఆర్ఎస్ కార్యకర్త లకినేని సురేందర్‌ను ఆమె ఖమ్మం జైలులో శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ ట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. అక్రమ కేసులతో కేసీఆర్ సై న్యాన్ని కట్టడి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని, కానీ కేసీఆర్‌ను, కేసీఆర్ సైన్యా న్ని కట్టడి చేయడం ఎవరికీ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా తమను ఆపలేరని అన్నారు. గ్రామసభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు సురేందర్‌పై అక్రమ కేసు నమోదు చేసి జైలు పంపారని మండిపడ్డారు. అనంతరం పాండురంగాపురంలో జరిగిన సంత్‌శ్రీ సేవాలాల్ జయంతి వేడుకల్లో కవిత పాల్గొన్నారు. గిరిజనలు వారి సంప్రదాయ పద్ధతిలో ఆమెకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కవిత ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటా రు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌లాల్ హరిప్రియనాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు అన్యాయం
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు, రైతు లు, విద్యార్థులు ఇలా ఏ ఒక్క వర్గానికీ సంక్షే మ పథకాలు అందడం లేదని, ఇది పూర్తిగా సంక్షోభ ప్రభుత్వంగా మారిపోయిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఖమ్మంలో బీసీ నాయకులతో నిర్వహించనున్న రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చిట్యాలలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కవితను స్వాగతించి సన్మానించారు.
యాదవ సంఘం ఆధ్వర్యంలో కవితకు గొర్రెపిల్లను బహూకరించారు. కవిత మీడియాతో మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్ రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకత్వంలో రైతుల కు న్యాయం జరిగే వరకూ కృషి చేస్తామని చెప్పారు. స్వాగతం పలికినవారిలో చౌటుప్పల్ మాజీ జడ్పీటీసీ బుచ్చిరెడ్డి, నాయకుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, బొళ్ల శివకుమార్, ఢిల్లీ మాధవరెడ్డి, మాచర్ల కృష్ణ, ఉడుగు మల్లేశం, చిన్నం బాలరాజు, గడ్డం యాదగిరి, మెరుగు శ్రీనివాస్, రామకృష్ణ, పిల్లలమర్రి సాయి, బీఆర్ఎస్ చిట్యాల పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, నాయకులు సునీత, కన్నెబోయిన జ్యోతి బలరాం, జడల ఆదిమల్లయ్య, కూరెళ్ల లింగస్వామి, మెండె సైదులు, కొలను సతీశ్, సుంకరి యాదగిరి, బాలగోని రాజు, జిట్ట శేఖర్, ఆగు అశోక్, రాములు ఉన్నారు.
కేసీఆర్‌పై కోపంతో.. తెలంగాణకు నష్టం చేస్తున్న రేవంత్ ; ఖమ్మంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కేసీఆర్‌పై కోపం పెంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణలో గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలిపివేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో శనివారం పర్యటించిన ఆమె.. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో పాత్రికేయులతో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల సాగునీటి అవసరాలను తీర్చడంతోపాటు గోదావరి, కృష్ణా జలాలను అనుసంధానం చేసే సీతారామ ఎత్తిపోతల నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం లంకచర్ల వద్ద 1090 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ ప్రజల గతి ఏమి కావాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి కురచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా ఎలాంటి ఉపయోగమూ లేదని విమర్శించారు. మేడిగడ్డ, దేవాదుల ప్రాజెక్టుల్లోని నీటిని వినియోగించకుండా రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. కృష్ణా జలాలను వినియోగించుకోవడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. తన సొంత జిల్లాకు కూడా సాగునీరు ఇచ్చే స్థితిలో సీఎం లేరని ధ్వజమెత్తారు.