TG PGECET | హైదరాబాద్ : టీజీ పీజీఈసెట్ -2024 ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. వెబ్ ఆప్షన్లకు అర్హులైన అభ్యర్థుల జాబితాను కూడా అధికారులు విడుదల చేశారు.
అయితే వర్షాలు, వరదల కారణంగా వెబ్ ఆప్షన్లకు సంబంధించి అధికారులు రీషెడ్యూల్ విడుదల చేశారు. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఫేజ్-1కు సంబంధించి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 6వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్‌కు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 9వ తేదీన సీట్ల కేటాయింపు జరగనుంది. ఫస్ట్ ఫేజ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు 10 నుంచి 13వ తేదీ మధ్యలో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని సూచించారు. 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | మరికాసేపట్లో రోడ్డు మార్గంలో ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | వరద సాయం రూ. 5 లక్షలకు పెంపు : సీఎం రేవంత్ రెడ్డి
Khammam | తాగడానికీ నీళ్లు లేవు.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఖమ్మంలో వరద బాధితుల ఆందోళన