Revanth Reddy | మరికాసేపట్లో రోడ్డు మార్గంలో ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy | భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లా నీట మునిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరింది. జనజీవనం స్తంభించిపోయింది.
Revanth Reddy | హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లా నీట మునిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరింది. జనజీవనం స్తంభించిపోయింది. తాగడానికి మంచినీళ్లు లేక విలవిలలాడిపోతున్నారు. చిన్న పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. కరెంట్ సరఫరా కూడా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో వరద పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో రోడ్డు మార్గంలో అక్కడికి బయల్దేరనున్నారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలి. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ. 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలి. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెలకు పరిహారం పెంచాలి. వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తక్షణమే సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలన్నారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు కేటాయించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
Khammam | వరదలపై అవగాహనలేమి.. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులుండి ఏం లాభం?
Khammam | తాగడానికీ నీళ్లు లేవు.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఖమ్మంలో వరద బాధితుల ఆందోళన
NH 65 | పాలేరు ఉధృతి.. హైదరాబాద్-విజయవాడ హైవే బంద్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

