మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ సూచన మేరకు వానకాలంలో వరద ఉధృతి వల్ల బరాజ్‌కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దెబ్బతిన్న పిల్లర్ల వద్ద అప్, డౌన్ స్ట్రీమ్ ఏడు, ఎనిమిదో బ్లాకుల్లో పనులు చేపడుతున్నారు. ఏడో బ్లాక్ వద్ద వరద నీరు రాకుండా ఉండేందుకు మట్టికరకట్ట పనులు జరుగుతున్నాయి. ఏడో బ్లాక్‌లో కుంగిన 19, 20, 21 పియర్ల ప్రదేశాల్లో ఏర్పడ్డ ఖాళీ ప్రదేశాలను సిమెంట్, ఇసుకతో పూడ్చేందుకు చేసే గ్రౌటింగ్ కోసం యంత్రాలు, మెటీరియల్‌ను నిర్మాణ సంస్థ సిద్ధం చేసింది. బరాజ్‌లో నిర్వహిస్తున్న పనులను భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు గురువారం పర్యవేక్షించి పనుల పురోగతిపై సంస్థ ప్రతినిధులతో చర్చించారు. బరాజ్ దిగువన కుంగిన పియర్ల ప్రాంతంలో కాపర్ షీట్ఫైల్స్ను అమర్చుతున్నారు. 20, 21 గేట్ కట్టింగ్ పనులు, వరద ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఇసుకను తొలిగిస్తున్నారు. డౌన్‌స్ట్రీమ్‌లో భారీ క్రేన్ల సాయంతో సీసీ బ్లాక్
అమరిక పనులు జరుగుతున్నాయి. – మహదేవపూర్