Home Guards | హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): హోంగార్డుల రేషన్‌కార్డులపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడిందా? వాటిని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నదా? ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ పేరుతో ఆ కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టిందా? అంటే అవుననే అం టున్నారు హోంగార్డులు. గత ప్రభుత్వా లు తమ పరిస్థితిని అర్థం చేసుకొని దయ తో ఇచ్చిన రేషన్‌కార్డులను కాంగ్రెస్ ప్రభు త్వం తొలగిస్తే.. ఎన్నో ఇబ్బందులు పడా ల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కారుణ్య నియామకాలు చేపట్టి, ఇతర ఆరోగ్య వసతులు కల్పించి హోంగార్డులను ఆదుకుంటామని ఎన్నికల వేళ చెప్పి న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఏడా ది తిరగకుండానే కారుణ్య నియామకాలు చేపట్టేది లేదంటూ రహస్యంగా ఉత్తర్వు లు ఇవ్వడం, 21 రోజులు విధులకు గైర్హాజరైతే సస్పెండ్ చేయడాన్ని మరువకముందే మరో పిడుగు నెత్తి మీద వేస్తున్నారని హోంగార్డులు వాపోతున్నారు.
ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పడంతో ఆర్థిక పరిస్థితి బా గాలేని వేలాది మంది హోంగార్డులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను ప్రత్యేకంగా వెరిఫికేషన్ చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ఓ సర్క్యూలర్‌ను జారీచేసింది. కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుళ్లు, హోంగార్డుల ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను ఆధార్‌తో వెరిఫై చేసి, డేటాబేస్‌లో భద్రపరిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.
జిల్లా, మున్సిపాలి టీ, గ్రామం/వార్డు, పేరు, ఆధార్, కులం, మొబైల్ నంబర్ ఫార్మాట్లో వివరాలు పంపాలని కోరారు. దీంతో డీజీపీ కార్యాలయం అన్ని జిల్లాల యూనిట్ ఆఫీసర్లకు ఆ సర్క్యూలర్‌ను పంపింది. దీనిపై హోంగార్డులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా హోంగార్డుల రేషన్‌కార్డు వివరాలు సేకరించి.. వాటిని ఎత్తివేసే కుట్ర చేస్తారేమోనని ఆందోళనలో హోంగార్డులు ఉన్నారు. రేషన్‌కార్డులు యధాతథంగా ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని హోంగార్డులు కోరుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం హోంగార్డులకూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.