నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌కు ఊరట లభించింది. ఆమెపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు వాపస్ చేసింది. దీనిపై నాంపల్లిలోని నాలుగో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఆమె రాజ్యసభ సీటు కోసం దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు కారణమైన కేసు విచారణ ముగిసింది. అంతకు ముందు ప్రతివాదుల తరఫున కాంగ్రెస్ లీగల్‌సెల్ అడ్వకేట్ రవిశంకర్ జంధ్యాల కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్ దాఖలు చేసిన సమయంలో ప్రత్యుర్థులుగా ఉన్నవారు వివిధ హోదాల్లో ఉన్నారని, వారి హోదాలను పరిగణిస్తే మెజిస్ట్రేట్ కోర్టుకు విచారించే అర్హత లేదని, ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వారిపై ఈ పిటిషన్ చెల్లదని తెలిపారు.
ప్రతివాదుల తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆ పిటిషన్‌ను వాపస్ చే సింది. ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలు చే సుకొనే అవకాశం ఉంటుందని సూచించింది. నిరుడు మే నెలలో తనపై లైంగిక దాడి జరిగినట్టు పిటిషనర్ శివకుమార్‌రెడ్డిని ప్రధాన ప్రతివాదిగా జోడించింది. చిట్టెం పర్ణికారెడ్డి, బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ (ఎమ్మెల్సీ). మీ నాక్షీ నటరాజన్, వాకిటి శ్రీహరి (మంత్రి), ప్రశాంత్‌రెడ్డి, చిట్టెం అభిజయ్రెడ్డిని ప్రతివాదులగా తన పిటిషన్లో పేర్కొన్నది. తన పిటిషన్‌ను కోర్టు వాపస్ మాత్రమే చేసిందని, ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించి మరోసారి పిటిషన్ దాఖలు చేస్తానని పిటిషనర్ మీడియాకు వెల్లడించారు. తనకు న్యాయం జరిగే వరకూ న్యాయపోరాటం చేస్తానని ఆమె ప్రతినబూనారు. తన వల్ల మీనాక్షీ నటరాజన్‌కు రాజ్యసభ సీటు పోలేదని చెప్పారు.