హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మూగజీవాలకు రక్షణ కల్పించాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. దీనికి విధివిధానాలను రూపొందించడానికి త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో మూగజీవాల రక్షణపై గురువారం జరిగిన సదస్సులో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గోవుల రక్షణ కోసం చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : పనివేళలు మార్చాకే ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) అమలుచేయాలని గురుకుల సొసైటీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా గతంలో జనరల్, బీసీ గురుకులాలు మినహా మిగతా సొసైటీ పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభమయ్యేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కామన్ టైంటేబుల్‌ను జారీచేసింది.