e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News డాగ్​ బ్రీడర్స్​కు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి

డాగ్​ బ్రీడర్స్​కు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి

హైదరాబాద్​ : జీహెచ్ఎంసీ పరిధిలో పెంపుడు జంతువులపై కూరత్వాన్ని అరిట్టాలని, డాగ్​ బ్రీడర్స్​(కుక్కల పెంపకందారులు, అమ్మకందారుల) అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్​ కుమార్​ అధికారులను ఆదేశించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం‌‌–2017 నిబంధనలకు లోబడి డాగ్​ బ్రీడర్స్​ కార్యకలాపాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. బ్రీడింగ్​ యాక్టివిటీలో ఉన్న వారందరూ చట్టానికి లోబడి వ్యవరించే విధంగా తెలంగాణ స్టేట్​ ఎనిమిల్​ వెల్ఫేర్​ బోర్డు రిజిస్ట్రేషన్​ కలిగి ఉండేలా డాగ్​ బ్రీడర్స్​ కు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు మున్సిపల్​ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్​ కుమార్​ శనివారం జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​ కుమార్​, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్​ రంజన్​ లకు లేఖలు రాశారు. డాగ్​ బ్రీడింగ్​ ఆక్టివిటీ చేసే వారందరు స్టేట్​ ఎనిమల్​ వెల్ఫేర్​ బోర్డు రిజిస్ట్రేషన్​ చేసుకునే విధంగా వచ్చే నాలుగు వారాల పాటు గడువు కల్పించి రిజిస్ట్రేషన్​ కు సహకరించాలని సూచించారు.

ఫేస్​ బుక్​, ట్విట్టర్​, ఇన్ స్టాగ్రామ వంటి సోషల మీడియా నెటవర్కింగ్​ ద్వారా అధికారిక, అనధికారిక ప్రకటనలతో కుక్క పిల్లల క్రయవిక్రయాలు జరపడం అక్రమమని అర్వింద్​ కుమార స్పష్టం చేశారు. అన్​ లైన్​ ద్వారా కుక్క పిల్లల క్రయ విక్రయాలకు తెలంగాణ స్టేట ఎనిమల్​ వెల్ఫేర్​ బోర్డు రిజిస్ట్రేషన తప్పనిసరి అన్నారు. ఆన్ లైనలో జరిగే ఇలాంటి లావాదేవీలు, వ్యాపారాలపై ఐటీ శాఖ నిఘా వేసి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్​ కు సూచించారు.

- Advertisement -

నిబందనలు పాటించని వారి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఇందు కోసం డైరెక్టర్​, పశుసంవర్ధక శాఖ, డైరెక్టర్​, మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన(సిడిఎంఏ), హైదరాబాద్​, సైబరాబాద్​, రాచకొండ పోలీసు కమిషనర్ల సహకారంతో రిజిస్ట్రేషన్​ లేని డాగ్​ బ్రీడర్సపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదించాలని పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana