నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వేసిన పరువునష్టం దావాలో సాక్షుల వాం గ్మూలాల్ని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నమోదు చేయనుంది. ఇప్పటికే కేటీఆర్‌తోపాటు సాక్షి దాసో జు శ్రవణ్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన కోర్టు మిగతా వారి వాంగ్మూలాల నమోదును పూర్తి చేయనుంది. తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ఈ కేసులో ఇతర సాక్షులుగా ఉన్నారు. వీరంద రి వాంగ్మూలాల రికా ర్డు అనంతరం.. మం త్రి కొండా సురేఖకు సంజాయిషీ ఇచ్చుకొనే అవకాశాన్ని కోర్టు కల్పించనుంది.
నాగార్జున కేసులోనూ…
సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో హాజరు కావాలని కోర్టు మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. బుధవారం ఆమె కోర్టుకు హాజరై వివరణ ఇవ్వనున్నారు.