KU Hostel | హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో ఎలుకల బెడద కలకలం సృష్టిస్తుంది. కేయూలోని సమ్మక్క సారక్క హాస్టల్లో 14 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. మరోవైపు మందుల కోసం యూనివర్సిటీ హెల్త్ సెంటర్కు వెళ్తే మందులు లేవని వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి దుస్థితి ఏర్పడింది.
యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపపై వర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలుకల బెడదపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. హాస్టల్లో ఉండాలంటేనే భయంతో వణికిపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.