తాంసి, డిసెంబర్ 10 : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రత్నాపూర్ గ్రామస్తులు కొండను తవ్వి రోడ్డు వేసుకున్నారు. కొండపై ఉన్న రత్నాపూర్లో 150 గడపలు ఉండగా.. 400 పైగా ప్రజలు నివసిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డును మంజూరు చేయగా.. పనులు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రోడ్డు పనులు నిలిచిపోవడంతో రెండేండ్లుగా రాళ్లు, రప్పల పైనుంచే మండల, జిల్లా కేంద్రాలకు ప్రజలు, కూలీలు వివిధ పనులకు వెళ్తున్నారు.
స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌ను ఏకగ్రీవం చేసుకున్నారు. బుధవారం పురుషులు, మహిళలు అందరూ కలిసి కొండను తవ్వి కిలోమీటరున్నర రోడ్డు వేసుకున్నారు.