యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై లక్ష్మీనరసింహస్వామి వారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ తూర్పు గోపురం ముందు చతుర్వేద పారాయణం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్వామివారిని బంగారు రథంలో ఊరేగించనున్నారు. రథ సప్తమి వేడుకల నేపథ్యంలో ఉదయం 10 గంటల వరకు సువర్ణ పుష్పార్చనను అధికారులు రద్దుచేశారు.
యాదగిరిగుట్ట పాతగట్ట ఆలయంలో అధ్యయనోత్సవాలు రెండో రోజూ కొనసాగుతున్నాయి. పురప్పాట్టు సేవ, తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవాకాలం పూజలు నిర్వహించారు.