రుద్రూర్, సెప్టెంబర్ 9: వచ్చే ఎన్నికల్లో తామంతా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం, రాణంపల్లి గ్రామంలోని ఏడు కుల సం ఘాల వారు శనివారం ఏకగ్రీవ తీర్మా నం చేశారు. ఈ మేరకు తీర్మాన ప్రతిని బాన్సువాడలో స్పీకర్ను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరూ లబ్ధిపొందినట్టు తెలిపారు. ప్రతి కుల సంఘ అభివృద్ధికి స్పీకర్ పోచారం విశేష కృషిచేశారని కొనియాడారు.
గ్రామంలో రూ.8 కోట్లతో పనులు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి పోచారం శ్రీనివాసరెడ్డిని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. పోచారం లాంటి నాయకుడు ఉంటే గ్రామాలే కాదు, రాష్ర్టాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు.