Harish Rao | హైదరాబాద్ : రాఖీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అక్కాచెల్లెమ్మలు ఆత్మీయంగా రాఖీ కట్టారు. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సోదరీమణుల ప్రేమ, ఆప్యాయత నాకు ఎప్పటికీ ప్రత్యేకం. తెలంగాణలో ప్రతి సోదరి సుఖసంతోషాలతో ఉండాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని భగవంతుడిని కోరుకుంటున్నాను అని తెలిపారు. రాఖీ కట్టిన సోదరీమణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
రాఖీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి @BRSHarish గారి నివాసంలో సందడి వాతావరణం నెలకొంది.
అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అక్కాచెల్లెమ్మలు ఆత్మీయంగా రాఖీ… pic.twitter.com/kJONx1kSK9
— Office of Harish Rao (@HarishRaoOffice) August 9, 2025