హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వ అధికారిక హెలికాప్టర్‌ను రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే బిహార్ ఎన్నికల్లో ఎలా వాడుతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగాన్ని చేత బట్టుకొని ఊరేగే రాహుల్‌గాంధీకి ఇది చట్టవిరుద్ధమని తెలియదా..? అని పేర్కొన్నారు.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా.. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం పంచిపెడుతున్నారని రాకేశ్‌రెడ్డి ఆరోపించారు.