Bandi Sanjay | విద్యానగర్, ఫిబ్రవరి 16 : రాజీవ్ గాంధీ అసలు హిందువే కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని అంబేదర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్వదేశీ మేళా’ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బండి సంజయ్ మాట్లాడారు.
రాజీవ్‌గాంధీ హిందువు అయినందున ఆయన కుమారుడు రాహుల్‌గాంధీ కూడా హిందువేనని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరమన్నారు. రాజీవ్‌గాంధీ తండ్రి ఫిరోజ్ జహంగీర్‌ఖాన్ పార్శీ, ఆయన మతమే రాజీవ్‌గాంధీకి వర్తించినప్పుడు హిందువు ఎలా అవుతారని ప్రశ్నించారు. బీసీ కులగణన పేరుతో హిందువులకు అన్యా యం జరుగుతున్నదని తెలిపారు. 10% ముస్లింలకు కేటాయించి, 42% బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారో చెప్పాలని నిలదీశారు. బీసీ జాబితా లో నుంచి ముస్లింలను తీసేసి కేంద్రానికి పంపిస్తే ఆమోదం పొందేలా చేస్తామన్నారు.