హైదరాబాద్/నాంపల్లి క్రిమినల్ కోర్టు లు, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏకకాలం లో సోదాలు నిర్వహించి వీరిని అరెస్టు చేశా రు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి (కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి) గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేశారు. ఆయన్ని హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలోని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు లో ఏ2గా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి గతంలో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చే సింది. మాజీ మంత్రి నాగేశ్వరరావు, ఆ యన కుమారుడు సునీల్‌కుమార్ నివాసా లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 8లక్షల నగదు, రెండు రో లె క్స్ వాచీలు, లగ్జరీ కార్లు, కొన్ని కీలక పత్రా లు, డిజిటల్ డివైజ్‌లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సరఫరా అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదా పు రూ.195.33 కోట్ల నష్టం వాటిల్లిందని, నిందితులు ఆ సొమ్మును అక్రమంగా ఆ ర్జించారని ఈడీ ఆరోపిస్తున్నది. ఈ మొత్తం స్కామ్ విలువ దాదాపు రూ.3,200 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మద్యం డిస్టిల్లరీలు, కంపెనీల నుంచి వ సూలు చేసిన సొమ్మును వివిధ షెల్ కంపెనీల ద్వారా రూట్ మార్చి, హవాలా పద్ధతిలో విదేశాలకు సైతం తరలించారనే ఆరోపణలపై ఈడీ కొత్తగా ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. కేసులో మొత్తం 33మందిని నిందితులుగా గుర్తించినట్లు స మాచారం. అరెస్టు అయిన ఇద్దరు నిందితుల విచారణ పూర్తిచేసి నాంపల్లిలోని ఈ డీ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యు డీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో నిందితులను చంచల్గూడా జైలుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ వ్యవహారంలో నో టీసులు జారీ చేసేందుకు ఈడీ అధికారు లు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.
రవాణా ఆదాయంలో 95-96శాతం సిండికేట్‌కు వెళ్లినట్టు ఈడీ పేర్కొంది. మా జీ మంత్రి నాగేశ్వరరావు, ఆయన కుమారిడికి రూ.15 కోట్లు అందాయని ఆరోపించింది. మరో కంపెనీకి రూ.68 కోట్లు చేరినట్టు తెలిపింది. అప్పటి అధికార వైఎస్సా ర్సీపీ నాయకులు, బినామీలు, ఇతర సంస్థ లు తప్పుడు లెక్కలు నమోదు చేసి డబ్బు ను కొల్లగొట్టారని వెల్లడించింది. ఏపీఎస్‌బీసీఎల్ నుంచి రూ.349.78 కోట్లు చెల్లించిన ఆధారాలు గుర్తించామని తెలిపింది.