హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆవర్తనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీనిప్రభావంతో మంగళవారం నుంచి మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలతోపాటు రాత్రి పూట చలి పెరుగుతున్నది. కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరగా.. మిగిలిన జిల్లాల్లో 32 డిగ్రీల మేరకు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో చలి తీవ్ర త పెరుగుతుండటంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇలాంటి వాతావరణమే ఉంటున్నది.