హైదరాబాద్, సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాగల 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే మూడ్రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొన్నారు. శనివారం నగరంలోని ఆసిఫ్‌నగర్, విజయ్‌నగర్‌కాలనీలో 1.08 సెం.మీ, షేక్‌పేటలో 1.08 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు తెలిపారు.