వచ్చే మూడు రోజులు వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని, ఇది ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్,జూలై 5 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని, ఇది ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. దీని ప్రభావంతో వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వర్షాలు కురిసే సమయంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నది. భారీ వర్షాలు కురుసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, రాబోయే మూడ్రోజులు గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని ప్రాంతాలకు విస్తరిస్తాయని వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

