అమరావతి : దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway ) తెలుగు రాష్ట్రాలకు తీపి కబురును అందించింది. ఇప్పటివరకు ఆయా స్టేషన్లలో ఆగని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ( Express Trains ) ఈనెల 7వ తేదీ నుంచి ఆపనున్నట్లు వెల్లడించింది. ఎర్నాకుళం-బరౌని రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్( 12522 ) రైలు చీరాల స్టేషన్లో (Chirala Station) ఆగనుందని తెలిపారు.
నాగర్సోల్- డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ( 16004 ) మహబూబ్‌నగర్ (Mahaboob Nagar )లోను, లోకమాన్య తిలక్ టెర్మినల్-మదురై ఎక్స్‌ప్రెస్ ( 22101 ) గుత్తిలో ప్రయాణికుల డిమాండ్ మేరకు ఆపనున్నట్లు ప్రకటించారు.
లోకమాన్య తిలక్-కారైక్కాల్ ఎక్స్‌ప్రెస్( 11017 ) గుత్తి, తాడిపత్రిలో, ఎర్నాకుళం-పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22669 ) ఖమ్మంలో (Khammam), డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12656 ) పెద్దపల్లి రైల్వేస్టేషన్లో ఆగనున్నాయని రైలు అధికారులు వెల్లడించారు.